చిరంజీవిపై మొదటిసారి షాకింగ్ కామెంట్స్ చేసిన న్యాచురల్ బ్యూటీ..!!

Divya
టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి.. విరి గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. చిరంజీవి డాన్సులకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి డాన్సులు పరిచయం చేసింది ఏఎన్ఆర్ అయితే ఆ తర్వాత వాటికి సరైన రూపాన్ని కమర్షియల్ హంగులను అందించింది చిరంజీవనే చెప్పవచ్చు. టాలీవుడ్ మొదటి తరం హీరోలలో చిరంజీవి మించిన డాన్సర్ లేరని కూడా చెప్పవచ్చు.

ఇప్పటికి కూడా పలు సినిమాలలో సరికొత్త స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు చిరంజీవి.. గత ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో తన డాన్స్ తో మరొకసారి ఫిదా చేశారు. అయితే ఇప్పటి తరం హీరోలలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు కూడా తమ డాన్సులతో అభిమానులను అలరిస్తూ ఉన్నారు. కానీ చిరంజీవి డామినేషన్ చేసే అంత డాన్స్ర్ ఎవరు చేయలేరని చెప్పవచ్చు. అప్పట్లో చాలామంది హీరోయిన్స్ సైతం చిరంజీవితో డాన్స్ వేయడానికి భయపడేవారు. విజయశాంతి ,రాధ తదితర హీరోయిన్స్ చిరంజీవితో పోటీపడి మరి డాన్సర్ గా రాణించారు.

ఇప్పటి తరం హీరోయిన్లలో సాయి పల్లవి కూడా బెస్ట్ డాన్సర్ అని చెప్పవచ్చు. ఈమెను డామినేట్ చేయడానికి ఈ మధ్యకాలంలో శ్రీ లీలా కూడా తనదైన స్టైల్ లో డాన్సులు వేస్తోంది. సాయి పల్లవి డాన్స్ కి చిరంజీవి కూడా ఎన్నోసార్లు ఫిదా అయ్యానని పలు ఇంటర్వ్యూలలో స్టేజి పైన కూడా తెలిపారు. అయితే చిరంజీవి డాన్సుల పైన సాయి పల్లవి స్పందించింది.. ఇటీవలే సాయి పల్లవి చిరంజీవి డాన్స్ పైన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

సాయి పల్లవి ప్రముఖ మీడియా ఛానల్లో మాట్లాడుతూ.. చిరంజీవి గారి డాన్సులు గ్రేస్ ఎవ్వరికీ సాధ్యం కాదని ఆయనలాగ ఎవరు చేయాలని ప్రయత్నించిన అది సాధ్యం కాదని ఆయన చేసినటువంటి మూమెంట్స్ చిరంజీవి గారికి తప్ప ఎవరికి రాలేదని తెలియజేసింది సాయి పల్లవి. చిరంజీవి గారు మోస్ట్ గ్రేడ్ ఫుల్ డాన్సర్ అని కూడా కితాబిచ్చింది.. చిరంజీవి గారు నటించిన ముఠామేస్త్రి సినిమాలో మార్కెట్లో వచ్చే టైటిల్ సాంగ్ గురించే ఈమె మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందులో డాన్స్ మూమెంట్ ని తాను ఎన్నోసార్లు ట్రై చేసినా అది తనకి కూడా సాధ్యం కాలేదని తెలిపింది. ముఖ్యంగా చిరంజీవి గారు చేసే రిథమ్ అది ఆయనకే సాధ్యమవుతుందని తెలిపింది.. అలాగే ఎన్నో చిత్రాలలో ఆయన డాన్స్ తోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: