అంతమంది మగాళ్ల మధ్య.. శరణ్య నగ్నంగా నటించిందట తెలుసా?

praveen
ఈ మధ్యకాలంలో సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోతున్న నటమణుల్లో శరణ్య కూడా ఒకరు.  ఫిదా అనే సినిమాలో సాయి పల్లవి అక్క పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పరిశ్రమలో వరుసగా ఛాన్సులు దక్కించుకుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాలో తన నటనతో ఒక మెట్టు ఎక్కేసారు శరణ్య. ఏకంగా బోల్డ్ సీన్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే శరణ్య ఇంత సాహసం చేయడం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ కి ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం గురించి శరణ్యకు వరుసగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం పోలీస్ స్టేషన్ సన్నివేశం మాత్రమే కాదు స్కూల్లో విల్లన్ తో వచ్చే సన్నివేశంలో కూడా శరణ్య నటన ప్రేక్షకులందరికీ గూడ్స్ బంప్స్ తెప్పిస్తుంది. అయితే పోలీస్ స్టేషన్లో న్యూడ్ సీన్ గురించి డైరెక్టర్ చెప్పగానే ముందుగా భయపడిందట. కానీ ఇక ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ లో అలాంటి సన్నివేశం  తప్పనిసరిగా చేయాల్సిందే.. అని భర్త సపోర్ట్ ఇవ్వడంతో చివరికి చేయడానికి ఒప్పుకుందట.

 ఇలా పోలీస్ స్టేషన్లో నగ్నంగా ఉండే సన్నివేశంలో నటించే సమయంలో ఏకంగా ఐదుగురు మాత్రమే సెట్లో ఉన్నారట. డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, డిఓపి, అసిస్టెంట్ డైరెక్టర్, ఇక మరో వ్యక్తి మాత్రమే ఇక అక్కడ సెట్ లో ఉన్నారట. కేవలం ఇంతమంది మగాళ్ళ మధ్య మాత్రమే ఈ సీన్ చేసిందట శరణ్య. దీంతో కంఫర్టబుల్గా సీన్ కంప్లీట్ చేసిందట. అయితే ఇక ఆమె ఎంతో ధైర్యం చేసి ఈ సన్నివేశంలో నటించింది కాబట్టి ఇక ఈ సన్నివేశం సినిమాకు ఒక కీలక టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది అని చెప్పాలి. సినిమా మొత్తానికి హైలైట్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: