వికటించిన సోహైల్ సాహసం !

Seetha Sailaja
‘బిగ్ బాస్’ షోతో వేలాదిమంది అభిమానులను పొందిన సొహైల్ సోషల్ మీడియాలో ఒక సంచలనం. అతడు పాల్గొన్న ‘బిగ్ బాస్’ సీజన్ సమయంలో అతడిని ‘బిగ్ బాస్’ షో విజేతను చేయడానికి వేలాదిమంది ఫాలోయర్స్ లక్షల సంఖ్యలో ఓట్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే అది గతం. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు అనే చిన్నమూవీ గతవారం విడుదలైన చిన్న సినిమాల రేస్ మధ్య విడుదలైంది.

ఈసినిమాను సోహైల్ తానే నిర్మాతగా మారి తన ఆస్తులు అన్నీ అమ్మి కోట్లు పెట్టుబడి పెట్టి తాను రిస్క్ చేసి తీశాను అంటూ అతడే స్వయంగా అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఈసినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన దగ్గర ప్రమోషన్లకు డబ్బులు లేవని దయచేసి థియేటర్లకు రమ్మని దీనంగా వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకపుడు సోషల్ మీడియాను షేక్ చేసిన ఇతడి సినిమాను చూడటానికి కనీసపు సంఖ్యలో కూడ ప్రేక్షకులు రాకపోవడంతో అతడు షాక్ కు గురయ్యాడు. అంతేకాదు బిగ్ బాస్ టైంలో వేల మంది కామెంట్లతో తన పేరుని హోరెత్తించారని మరిప్పుడు ఎందుకు తన సినిమా చూడరని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. దీనితో సొహైల్ నైరాశ్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో కొందరు అతడి నైరాశ్యం పై ఆశక్తికర కామెంట్స్ చేస్తున్నారు. జనానికి సినిమా నచ్చితేనే సినిమా చూస్తారు కాని వేడుకుంటే ధియేటర్లకు జనం రారు అంటూ సోహైల్ కు సలహాలు ఇస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిన పరిస్థితులలో ఎలాంటి సినిమా తీస్తే విజయవంతం అవుతుందో తెలియకుండా సినిమాలు తీయడం సోహైల్ పొరపాటు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాలలో సింపతి వేవ్ ఉంటుంది కానీ సినిమాల విషయంలో మాత్రం ఎలాంటి హీరో అయినా ప్రేక్షకులను మెప్పించలేకపోతే పరాజయాల నుండి తప్పించుకోలేరు అన్న విషయానికి ఇది ఒక ఉదాహరణ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: