సౌందర్య చనిపోతే ఆ హీరోయిన్ అంతలా ఆనంద పడిందా..? ఛీ ఛీ ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉందా..?
అబ్బా సౌందర్య గారిలా ఏ హీరోయిన్ నటించదు రా అని మనలో చాలామంది అనుకునే ఉంటారు . అయితే అలాంటి సౌందర్య అర్ధాంతరంగా చనిపోతే ఒక హీరోయిన్ సంతోష పడింది ..బాగా ఎంజాయ్ చేసింది అన్న వార్త అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఉండే సౌందర్య ఫ్యాన్స్ నే కాదు సామాన్య జనాలను సైతం బాధపెట్టింది . అప్పట్లో ట్రెడిషనల్ పాత్రలో నటించేది సౌందర్య. అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వస్తున్న స్నేహ కూడా సౌందర్య గారి లా మారబోతుంది అంటూ ట్యాగ్ చేయించుకుంది. కానీ ఎక్కడో స్నేహ కి రావాల్సిన పాత్రలన్నీ సౌందర్యానే దక్కించుకుంది అంటూ టాక్ వినిపించింది.
ఒకానొక మూమెంట్లో స్నేహ.. సౌందర్య చనిపోతే బాగా హ్యాపీగా ఫీల్ అయింది అని ..సౌందర్య పాత్రలో ఇక ఆమెకే వస్తాయి అని ..సౌందర్య స్థానం ఇండస్ట్రీలో తనదే అంటూ ఆనంద పడింది అని కూడా వార్తలు వినిపించాయి. ఒకానొక ఇంటర్వ్యూలో స్నేహాని ఇదే ప్రశ్న అడగ్గా.. హోస్ట్ కి ఆమె దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది . "అసలు అవంతా ఫేక్ .. నేను సౌందర్య గారు చనిపోతే ఎందుకు ఆనందపడతాను... ఆమె ఒక మంచి నటి .. అలాంటి నటిని కోల్పోవడం ఇండస్ట్రీలో అందరికీ బాధగానే ఉంది . అలాంటి ఒక నటి చనిపోతే నేను ఆనందపడతానా..? ఎవరో ఇలా నాపై నిందలు వేయడానికి ట్రై చేస్తున్నారు "అంటూ క్లారిటీ ఇచ్చింది . నిజానికి స్నేహ క్యారెక్టర్ కూడా చాలా చాలా మంచిది. ఆమె ఎప్పుడు ఎవరి చెడ్డ కోరుకోరు . చాలా ట్రెడిషనల్ గా తన పని తను చూసుకుంటూ తనకు వచ్చిన అవకాశాలను మాత్రమే చేసుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో స్నేహ ఎవరితో అలా ప్రవర్తించిన దాఖలాలు లేవు. మరి అలాంటి స్నేహా పై ఇలాంటి చెత్త రూమర్ రావడం నిజంగా ఆమె ఫ్యాన్స్ కు హర్టింగ్గా అనిపించింది. ఛీ ఛీ ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు అంటూ ఆ ట్రోల్ చేసే వాళ్లని ఏకిపారేశారు...!!