రాజమౌళి సినిమా కోసం బిగ్ రిస్క్ చేస్తున్న మహేష్ బాబు.. ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయిగా..!

Thota Jaya Madhuri
రాజమౌళితో సినిమా అంటేనే బిగ్ రిస్క్.. అలాంటిది మహేష్ బాబు అంతకుమించిన బిగ్ రిస్క్ చేస్తూ ఉండడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోలు.. కాదు కాదు పాన్ ఇండియా హీరో లకు మించిన స్థాయిలో క్రేజీ పాపులారిటీ దక్కించుకున్నాడు ఎ స్ ఎ స్ రాజమౌళి. ఇప్పటి వరకు తాను తెరకెక్కించిన సినిమా లు అన్ని ఎంత లా హీట్ అయ్యాయో మనకు తెలిసిందే . మరే ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించి న బాహుబలి సినిమా తెలుగు ఇండస్ట్రీ స్థాయి ని మరో లెవల్ కి తీసుకెళ్లింది అని చెప్పాలి .  

అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ చూసిన ఆస్కార్ అవార్డు సైతం ఇండియా కి తీసుకొచ్చాడు . కాగా ఇప్పుడు మహేష్ బాబు తో ఒక సినిమా ని తెరకెక్కించడాని కి ప్లాన్ చేస్తున్నాడు . ఈ సినిమా కోసం దాదాపు సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు జక్కన్న- మహేశ్ బాబు. ఇదే మూమెంట్లో మహేష్ బాబు లుక్స్ మొత్తం చేంజ్ చేసేసాడు . అయితే ఈ సినిమా లో మహేష్ బాబు డూప్ లేకుండా నటించమంటూ రాజమౌళికి సలహా ఇచ్చారట.  


సినిమాకి పబ్లిసిటీతో పాటు మహేష్ బాబు కెరియర్ లోనే ఈ సినిమా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోతుంది అంటూ సజెస్ట్ చేశారట.  మహేష్ బాబు కూడా అందుకు ఓకే చేశారట. రాజమౌళి సినిమా అంటే ఎన్ని అడ్వెంచర్స్ ఉంటాయో తెలిసిందే. అలాంటిది డూప్ లేకుండా హీరో అంటే మాత్రం చాలా చాలా కష్టమైన విషయమని చెప్పాలి . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే  మహేష్ బాబు అభిమానుల గుండెల్లో మాత్రం  రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: