పూరి జగన్నాథ్ కూతురు ఇంతలా మారిపోయింది ఏంటి.. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోదుగా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్త నుండే అద్భుతమైన విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో చాలా తక్కువ సమయం లోనే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుడి స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి అనేక బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలంలో మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు.

అలాగే స్టార్ హీరోలా సినిమాలకు దర్శకత్వం వహించడంలో కూడా వెనుకబడిపోయాడు. కొంత కాలం క్రితం ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత లైగర్ , డబల్ ఇస్మార్ట్ అనే మూవీ లతో భారీ అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇక ఈయన సినిమా జీవితం విషయం పక్కన పెడితే ... ఈయనకు ఆకాష్ , పవిత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాష్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఈయన ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర చిన్న తనంలో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు.
 

ఇకపోతే ఈ మధ్య కాలంలో పవిత్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇక పవిత్ర సోషల్ మీడియాలో చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. ఇక క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లోనే ఈమె తన అందమైన లుక్ తో జనాలను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: