ఇక్కడ పెళ్లి అయితే ఆంటీలు ..అక్కడ పెళ్లైతే కత్తిలాంటి ఫిగర్లు.. ఇవేం లెక్కలు రా బాబు..!

Thota Jaya Madhuri
నచ్చిన వాళ్ళు ఏ పని చేసినా బాగుంటుంది . మనకు నచ్చని వాళ్ళు ఎంత  మంచి పని చేసినా అది చెడుగానే ఉంటుంది.  అలాగే తయారైపోయింది ఇప్పుడు ఇండస్ట్రీలోని హీరోయిన్స్ పరిస్థితి . మనం బాగా గమనించినట్లయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేసే ఏ బ్యూటీ అయినా సరే పెళ్లి చేసుకుంది అనుకోండి .. ఆ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో నటించడం చాలా తక్కువ . మరీ ముఖ్యంగా చాలామంది పెళ్లి అయిపోయిన తర్వాత ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆమెను ఆంటీలు గా చూస్తూ ఉంటారు .

 
తెలుగు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ..డైరెక్టర్, మేకర్స్ అలాంటి హీరోయిన్స్ కి సెకండ్ లీడ్ పాత్రలు ఇస్తారే కానీ మెయిన్ హీరోయిన్ గా ఎప్పుడు కూడా అవకాశాలు ఇవ్వరు . అలాంటి దాఖలాలు కూడా ఇండస్ట్రీలో లేవు. అయితే బాలీవుడ్ లో , హాలీవుడ్ లో పరిస్థితి మాత్రం వేరేగా ఉంది . బాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకొని బిడ్డలను కనీ ఇప్పటికీ లీడ్ పాత్రలు పోషిస్తూ హీరోయిన్స్ గా రాజ్యం ఏలేస్తున్నారో మనం చూస్తున్నాం.  మరి ముఖ్యంగా ఆలియా భట్ .


అలియా భట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అలియా - రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ హీరోయిన్గా సినిమాలు చేస్తూనే ఉంది. అంతేనా లీడ్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. అదే విధంగా కియరా అద్వానీ కూడా పెళ్లి తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తూ పాన్ ఇండియా లెవెల్ లో చక్రం తిప్పుతుంది .


అయితే తెలుగులో కాజల్ అగర్వాల్ పెళ్లై బాబు పుట్టిన తర్వాత ఆంటీ గా మారిపోయింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకని తెలుగు డైరెక్టర్లు పెళ్లి అయిపోయిన హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వరు. ఇస్తే సెకండ్ లీడ్ పాత్రలు ఇస్తారు . అదే బాలీవుడ్ లో మాత్రం పెళ్లయిపోయిన కత్తిలాంటి ఫిగర్లుగా ట్రీట్ చేస్తూ ఆమెకు మెయిన్ లీడ్ పాత్రలు ఇస్తూ ఉంటారు.  ఏంటో మన తెలుగు ఇండస్ట్రీ ఇలా అయిపోయింది అంటూ చాలామంది జనాలు మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కించడం గొప్పకాదు హీరోయిన్స్ కి కూడా అందుకు సరైన న్యాయం చేయడం ఇంపార్టెంట్ అంటూ అమ్మాయిలు కూడా సపోర్ట్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: