ఆసక్తికరంగా అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ గమనిస్తుంటే అజయ్ ఘోష్ పాత్ర ఇందులో పూర్తి వినోదాత్మకంగా ఉండేలా అనిపిస్తోంది. ఇక చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ కారెక్టర్‌కు ఉండే కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమా పాయింట్ ఏంటి? వీరిద్దరి కథ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా పోస్టర్ ఉంది.
ఈ చిత్రానికి పవన్ సంగీతాన్ని అందించారు. శ్రీనివాస్ బెజుగమ్ కెమెరామెన్‌గా పని చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్లు ప్రకటించనున్నారు.
నటీనటులు : అజయ్ ఘోష్, చాందినీ చౌదరి
సాంకేతిక బృందం
బ్యానర్ : ఫ్లై హై సినిమాస్
నిర్మాత : హర్ష గారపాటి
దర్శకుడు : శివ పాలడుగు
సంగీత : దర్శకుడు పవన్
కెమెరామెన్ : శ్రీనివాస్ బెజుగమ్
ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి
పీఆర్వో : సాయి సతీష్