బూట్ కట్ బాలరాజు రివ్యూ అండ్ రేటింగ్!

Anilkumar
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోహెల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో ఇస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా సోహెల్ హీరోగా నిర్మాతగా తెరకెక్కిన సినిమా బూట్ కట్ బాలరాజు. మేఘలేఖ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్ ముక్కు అవినాష్ , సిరి హనుమంత్ ఇంద్రజ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాకు సోహెల్ స్వయంగా నిర్మాతగా మారి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది. ఈ సినిమా అసలు కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..
కథ:
పటేలమ్మ(ఇంద్రజ) తండ్రి(సుమన్)కి ఇచ్చిన మాట కోసం భర్తని వదిలేసి ఊరిపెద్దగా మారుతుంది. పటేలమ్మ కూతురు మహాలక్ష్మిని(మేఘలేఖ) చిన్నప్పటి నుంచి అందరూ గౌరవిస్తారు. కానీ ఆమె వద్దకు మాత్రం ఎవరు రావడానికి ఇష్టపడరు. స్కూల్ లో కూడా అదే పరిస్థితి. అయితే ఆ సమయంలో బాలరాజు(సోహెల్) మహాలక్ష్మిని కూడా అందరిలాగే ట్రీట్ చేయడంతో మహాలక్ష్మి బాలరాజుతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అలా బాలరాజు తన ఫ్రెండ్స్(అవినాష్, సద్దాం) తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ, కాలేజీ చదువుకుంటారు. అదే కాలేజీలో సిరి(సిరి హనుమంతు) బాలరాజుని ప్రేమిస్తుంది. మహాలక్ష్మి కూడా బాలరాజు ప్రేమలో పడుతుంది. ఇదే విషయాన్ని సిరి అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా తమ ప్రేమ విషయాన్ని బాలరాజుకు చెబుతారు.
ఎవరూ లేరు సమయంలో బాలరాజు మహాలక్ష్మి ఇంటికి వెళ్తారు. అక్కడ వీరిద్దరు కౌగిలించుకొని ఉండగా అప్పుడే పటేలమ్మ మహాలక్ష్మికి మంచి సంబంధం మాట్లాడి ఇంటికి వచ్చి వారిని చూస్తుంది. దాంతో తనని ఊరందరి చేత కొట్టిస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య మాట పెరుగుతుంది. దీంతో పటేలమ్మ వచ్చే ఎన్నికలలో నువ్వు కనుక సర్పంచ్ అయితే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అంటూ చాలెంజ్ చేస్తుంది. మరి ఎలాంటి సపోర్ట్ లేని బాలరాజు ఎన్నికలలో గెలిచారా సర్పంచ్ అయ్యారా మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నారా అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన
 ఇందులో సోహెల్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. మధ్య మధ్యలో తన కామెడీతో ప్రేక్షకులను అలదించారు. ఎమోషన్స్ సన్నివేశాలలో కూడా బాగానే నటించాడు సోషల్. ఇక మేఘలేక కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఎంతో బాగా ఒదిగిపోయినటించింది. ఇక సిరి కూడా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది పటేలమ్మ పాత్రలో ఊరి పెద్దగా ఇంద్రజ కూడా మంచిగా నటించారు. ముక్కు అవినాష్ సద్దాం వంటి వారందరూ కూడా వారీ వారీ పాత్రలకు మేరకు వాళ్లు పూర్తిగా న్యాయం చేశారు.
టెక్నికల్:
దర్శకుడు కోనేటి ఈ మూవీతో పరిచయం అవడంతో పాటు మంచి సక్సెస్ ని అందుకున్నారని చెప్పవచ్చు. సినిమా అంతా కూడా తెలంగాణలోని ఒక పల్లెటూర్లో జరుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతా బాగానే ఉంది. కెమెరా విజువల్స్ కూడా బాగానే చూపించారు. రెండు పాటలు మాత్రం వినడానికి, చూడటానికి బాగుంటాయి. ఎడిటింగ్ వర్క్ పరవాలేదు నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కామెడీ సన్నివేశాలు పల్లెటూరి వాతావరణం
మైనస్ పాయింట్స్:
మ్యూజిక్, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు లాగ్ అనిపించడం,రొటీన్ కథ
బాటమ్ లైన్:
మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా పరవాలేదని అనిపిస్తుంది.
రేటింగ్: 2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: