ఆ స్టార్ హీరో కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న త్రివిక్రమ్!

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా షూటింగ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేసి రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఎన్నికల తర్వాతే తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి వంటి సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలన్నీ కొన్ని షెడ్యూల్స్ షూటింగ్స్ కూడా జరుపుకున్నాయి. ఎలక్షన్ తర్వాతే పవన్ ఈ సినిమాల షూటింగ్స్ పూర్తి చేయనున్నాడు. ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలు వచ్చాయి. వీటిలో జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ అందుకోగా 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ చివరగా గెస్ట్ రోల్ చేసిన 'బ్రో' సినిమాకి మాత్రం గురూజీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ కి హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ పవన్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

కవేళ వీరి కాంబినేషన్ కనుక ఓకే అయితే ఈ ప్రాజెక్టును హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. ఇక త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'గుంటూరు కారం' ఈ సంక్రాంతికి రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. కానీ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. మహేష్ ఫ్యాన్స్ కి తప్పితే నార్మల్ ఆడియన్స్ ని ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. 'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమాని ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టు ఉంటుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారనే న్యూస్ బయటికి రావడం గమనార్హం గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: