ధనుష్, నాగార్జున కాంబోలో సినిమాకి అదిరిపోయే టైటిల్..!?

Anilkumar
దర్శకుడు శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ధనుష్ తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున సైతం కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఒక కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో నాగార్జున ధనుష్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తిరుపతిలో జరిగింది. అందులో భాగంగానే అక్కడికి వారి అభిమాన హీరోను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున రావడం కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది అని గత కొద్ది రోజుల క్రితం చాలా రకాల వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. ధనుష్ నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి ధారావి అనే టైటిల్ ఫిక్స్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ధారావి అంటే కచ్చితంగా అందరికీ ముంబై సిటీ గుర్తుకొస్తుంది. ఎందుకు అంటే అది ముంబై సిటీలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్మగ్లింగ్ ఏరియాలో ఒకటిగా చాలామందికి తెలిసి ఉంటుంది. అందుకే ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి అదే టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతుంది.

ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది అని సినిమాలో నాగార్జున ఒక డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. గతంలోనే నాగార్జున డాన్ అనే సినిమా చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ అలాంటి డాన్ పాత్రలో ఆయన నటించబోతూ ఉండడం గమనార్హం. ఈ సినిమాని నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు నిర్మిస్తుండగా సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: