నాగార్జున నా సామిరంగ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!!

Anilkumar
టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. కింగ్ నాగార్జున తో పాటు నాగచైతన్య అఖిల్ సైతం గత కొద్ది రోజులుగా వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్ అవడంతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు నాగార్జున. చాలా కాలం తర్వాత హిట్ అందుకోవడంతో నాగ్ అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. గోస్ట్ సినిమా తర్వాత నాగార్జున పని అయిపోయింది అని అనుకున్న క్రమంలోనే నా సామిరంగ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నాగార్జున.ఇక ఈ సినిమాలో ముందు కంటే చాలా యంగ్ గా కనిపించి షాక్ ఇచ్చాడు.

కొరియోగ్రాఫర్ విజయ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుల అయ్యింది. ఈసారి పండక్కి ఫ్యామిలీ అడియన్స్ అంతా చూడగలిగే సినిమాల్లో ఒకటిగా నిలిచింది నా సామిరంగ సినిమా. ఫ్యాన్స్ తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందించాడు నాగ్. అంతే కాదు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి రెస్పాన్స్ సాధించింది మూవీ. కొద్దిరోజులుగా నా సామిరంగ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏరోజు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను వచ్చే నెలలో

 ఫిబ్రవరి 15 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈరోజో రేపో ప్రకట వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.మీడియాం బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా.. మొదటి రోజే 5 కోట్లు వసూళ్ళు సాధిచింది. సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, సైంధవ్ చిత్రాలతో పోటీ పడి మరీ బ్రేక్ ఈవెన్ సాధించింది. విలేజ్ మాస్ డ్రామాగా వచ్చిన ఈ మూవీతో మరోసారి నాగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. కన్నడ భామ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లర్ హీరోయిన్లుగా నటించిన ఈసినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: