'హరిహర వీరమల్లు'.. మొదలుపెట్టి నాలుగేళ్లు

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో సినిమా షూటింగ్స్ పక్కన పెట్టిన పవర్ స్టార్ ప్రస్తుతం రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. మళ్లీ ఎలక్షన్స్ తర్వాత పవన్ కమిట్ అయిన సినిమా షూటింగ్స్ పూర్తి చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ఓ సినిమా షూటింగ్ మొదలై నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటివరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. కనీసం రిలీజ్ ఎప్పుడు అనే వివరాలు సైతం బయటకు రాలేదు.

ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు 'హరిహర వీరమల్లు'.. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సరిగ్గా నాలుగేళ్ళ క్రితం అంటే జనవరి 30, 2020 లో ఈ సినిమాని లాంచ్ చేశారు. అదే సమయంలో 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ కూడా మొదలైంది. కట్ చేస్తే.. వకీల్ సాబ్ రిలీజ్ అయింది. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు కూడా వచ్చాయి. కానీ హరిహర వీరమల్లు మాత్రం ఇంకా సెట్స్ పైనే ఉంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది కరోనా పాండమిక్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ లో ఆర్థికపరమైన అడ్డంకులు, బడ్జెట్ సమస్యలు.. ఇలా ఏదో ఒక కారణంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

2020లో ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత 2021 లో ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత షూటింగ్లో పవన్ స్టిల్స్ తప్పితే ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. కనీసం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని దానిపై కూడా క్లారిటీ లేదు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలాంటి పిరియాడికల్ రోల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: