నాని హాయ్ నాన్న క్లోజింగ్ కలెక్షన్స్..!

shami
న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను శౌర్యువ్ డైరెక్ట్ చేశాడు. సినిమాను వైరా క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. సినిమా మ్యూజిక్ పరంగా కూడా ప్రేక్షకులను మెప్పించింది.
ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దసరాతో ప్రేక్షకులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని హాయ్ నాన్నాతో మరోసారి కూల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఫైనల్ వసూళ్ల లెక్క తేలింది. సినిమా ఫైనల్ రన్ లో 72.5 కోట్ల గ్రాస్ అంటే 34.8 కోట్ల షేర్ రాబట్టింది. సినిమా 27.6 కోట్లు అంటే అటు ఇటుగా 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవ్వగా దానికి మరో 6 కోట్లు అదనంగానే రాబట్టింది.
నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అంటే క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమా కథల సెలక్షన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. నాని దసరా, హాయ్ నాన్న హిట్ ఫాం లో ఉండగా ఆ క్రేజ్ తో నెక్స్ట్ రాబోతున్న సరిపోదా శనివారం సినిమాకు సూపర్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా విషయంలో నిర్మాతలకు బిజినెస్ పరంగా కూడా భారీ డీల్ సెట్ రైట్ అవుతున్నట్టు తెలుస్తుంది. కాన్స్టంట్ హిట్లు పడుతున్న కారణంగా నాని సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ లోనే కాదు డిజిటల్ రిలీజ్ ల లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. వివేక్ ఆత్రేయతో వస్తున్న సరిపోదా శనివారం సినిమా డివివి దానయ్య నిర్మాణంలో వస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీపై కూడా నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: