ఎంట్రీ కి రెడీ అవుతున్న సమంత.. అందుకే ఈ పని..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్టులో సమంత పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈమె. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత వీరిద్దరూ కూడా కెరియర్ పరంగా బాగా బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలోనే సమంత మయోసైటిస్ అనే ఒక వ్యాధి బారిన పడింది.

ఇక ఈ వ్యాధి కారణంగా గత కొంతకాలంగా కృంగిపోతూ వస్తోంది సమంత. ఇందులో భాగంగానే సినిమాలకు కూడా దూరమైంది. ఇప్పుడిప్పుడే కాస్త కోరుకుంటూ మళ్ళీ సినిమాల వైపు అడుగులు వేస్తోంది. అలా తను కమిటైన సినిమాలను పూర్తి చేసింది. ఇక ఈ విధంగా సినిమాలో షూటింగులు అన్ని పూర్తయిన తర్వాత సినిమాలకి దాదాపుగా ఏడాది పాటు విరామం ఇచ్చింది. ఇలా ఏడాది పాటు ఇండస్ట్రీ కి దూరమైన తర్వాత తన వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంటుంది.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా సమంత సూర్యాస్తమ సమయంలో గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోలను సమంత షేర్ చేయడంతో ఎంతోమంది ఫాన్స్ ఈ ఫోటో పై వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు సమంత విరామం ప్రకటించి ఏడాది పూర్తి కావస్తుంది త్వరలోనే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందా అందుకే ఇలా కుస్తీ పడుతోందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: