అనుకున్న దానికంటే ముందే వార్ 2.. సూపర్ హింట్ ఇచ్చిన హ్రితిక్..!?

Anilkumar
 ఇద్దరూ పెద్ద స్టార్ హీరోలు కలిసి చేస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్  ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా ఇందులో   హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో  కనిపించబోతున్నారు. ఆపోజిట్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించ బోతున్నాడు. టాలివుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇది. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అన్న వార్తలు ఎప్పుడైతే బయటికి వచ్చాయో

అప్పటినుండి టాలీవుడ్ సినీ లవర్స్ కాకుండానే మొత్తంగా ఇండియా వైడ్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై అంచనాలు సైతం భారీగా పెరిగిపోయాయి. అనౌన్స్మెంట్ తోనే భారీగా అంచనాలు పెరిగిపోయిన ఈ సినిమా షూటింగ్లో ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరూ జాయిన్ అవ్వలేదు. తాజాగా ఫైటర్ సినిమా నుండి ఇప్పుడే కాస్త రిలాక్స్ అయ్యాడు హృతిక్ రోషన్. త్వరలోనే వార్ టు సినిమాలో జాయిన్ అవ్వనున్నాడు. అయితే ఫైటర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన

ఇంటర్వ్యూలో హ్రితిక్ రోషన్ లో మాట్లాడుతూ… “ఫైటర్ సినిమా కంప్లీట్ అయ్యింది… అసలు బ్రేక్ లేకుండా వార్ 2లోకి ఎంటర్ అవుతున్నా… వార్ 2 అందరు అనుకున్న దానికన్నా ముందే స్టార్ట్ అవుతుంది. ఊహించిన దానికన్నా ముందే వార్ 2 స్టార్ట్ అవుతుంది. కబీర్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాడు… సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయలేను కానీ కబీర్ ఈసారి ఇంకా కొత్తగా కనిపిస్తాడు” అని హ్రితిక్ చెప్పేసాడు. అయితే వార్ 2 సినిమా విషయంలో హ్రితిక్ చెప్పినట్లు త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే మాట నిజమయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: