ఓవర్సీస్ లో 'హనుమాన్' ప్రభంజనం

Anilkumar
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' ఈ సంక్రాంతికి జనవరి 12 న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా స్వామి రంగ వంటి సినిమాలు విడుదలైనా వాటన్నిటిలో 'హనుమాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా కలెక్షన్ల సునామీ ఆగలేదు. ఈ సినిమా తొలి వారంతో పోల్చితే రెండో వారంలో కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇక రిపబ్లిక్‌డే సెలవు కావడంతో, 

ఆ రోజు సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఇక అదే జోరు వీకెండ్స్‌లో కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే హనుమాన్‌ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అయిపోయినట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాకి ఓవర్సీస్ ఆడియన్స్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అక్కడ ఈ సినిమా మిలియన్ల కొద్ది డాలర్స్ ని కొల్లగొడుతుంది. ఓవర్సీస్ మార్కెట్ వద్ద స్టార్ హీరోల రికార్డ్స్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఓవర్సీస్ లో మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 'హనుమాన్' ఓవర్సీస్ మార్కెట్ వద్ద ఏకంగా 5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.

ఎలాంటి స్టార్ కాస్ట్ లేని ఓ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి అక్కడ హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక ఈ ఫీట్ తోహనుమాన్ ఓవర్సీస్ లో ఆల్ టైం టాప్ 5 హైయెస్ట్ గ్రాఫర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరోవైపు 'హనుమాన్‌' సినిమాకి ఇంత బిగ్ సక్సెస్‌ అందించినందుకుగాను ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పేందుకు స్పెషల్‌ మీట్‌ ఏర్పాటు చేశారు మేకర్స్‌. గ్రాటిట్యూడ్‌ మీట్‌ ద్వారా అందరికీ థ్యాంక్స్‌ చెప్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: