మోహన్ లాల్ ఖాతాలో మరో డిజాస్టర్?

Anilkumar
గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న  మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఎట్టకేలకు 'నెరు' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటూ బాక్సాఫీస్ దగ్గర  భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో మంచి కం బ్యాక్ అందుకున్న మోహన్ లాల్ తాజాగా 'మలైకోటై వాలిబాన్' మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందింది. మోహన్ లాల్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ చిత్రం కోసం నిర్మాతలు దాదాపు 60 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. ఇక భారీ అంచనాల నడుమ జనవరి 25 న రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ ని అందుకుంది. కానీ మోహన్ లాల్ క్రేజ్ తో తొలిరోజు ఈ చిత్రం కేరళలో 5.85 కోట్ల ఓపెనింగ్స్ అందుకుకోగా వరల్డ్ వైడ్ గా 12 కోట్లకు పైగా గ్రాఫ్ రాబట్టింది. కానీ సినిమాకి బిలో అవేరేజ్ టాక్ రావడంతో ఇది కాస్త కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. మొదటి రోజు 5.85 కోట్ల గ్రాఫ్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు రిపబ్లిక్ డే హాలిడే అయినప్పటికీ భారీ డ్రాప్ ని చవి చూసింది. ఆరోజు కేవలం 2.45 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది.

 ఇక మూడో రోజు అయితే మరీ దారుణంగా 1.45కోట్ల గ్రాస్ అందుకుంది. మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా కేరళలో 9.75 గ్రాస్ సాధించింది. సినిమాకి నాలుగు రోజు కలెక్షన్స్ మూడో రోజు కంటే మరింత తక్కువగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్ని బట్టి సినిమా రన్ ఇక్కడితో ముగిసినట్లేనని చెబుతున్నారు. కేరళలోనే కాకుండా ఇండియా వైడ్ గా ఈ సినిమా డే వన్ డీసెంట్ స్టార్ట్ ని అందుకున్నా తర్వాత రోజు నుంచి మాత్రం కలెక్షన్స్ లో భారీ పతనం కనిపించింది. సో ఓవరాల్ గా 'మాలైకోటై వాలిబాన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: