'హనుమాన్'.. మరో అరుదైన ఘనత!

Anilkumar
ప్రశాంత్ వర్మ - తేజ సబ్జా కాంబినేషన్లో తెరకెక్కిన 'హనుమాన్' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ లో స్టార్ హీరోల రికార్డ్స్ అన్నిటిని పటాపంచలు చేసేసింది. కేవలం తెలుగు రాష్ట్రలోనే కాదు విడుదలైన ప్రతి చోట రికార్డు స్థాయిలో రాష్ట్రాల్లోనే అందుకుంటుంది. ఇప్పటికే విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలో ఎంటర్ అయిన ఈ చిత్రం ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక తాజాగా 250 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం   టాలీవుడ్ లో ఆల్ టైం సంక్రాంతి హైయెస్ట్ గ్రాఫర్ గా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.

గతంలో అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో 260 కోట్లతో ఈ ఘనత సాధించింది. మరి కొద్ది రోజుల్లోనే హనుమాన్ ఈ రికార్డ్ బ్రేక్ చేయడం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. అదేంటంటే, 'హనుమాన్' ఒక కోటికి పైగా ఫుట్ ఫాల్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. పోటీగా అగ్ర హీరోల సినిమాలు ఉన్నా హనుమాన్ లాంటి చిన్న సినిమా ఫుట్ ఫాల్స్ విషయంలో ఇలాంటి రేర్ ఫీట్ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇప్పటికే 250 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో 300 కోట్ల టార్గెట్ తో పరుగులు పెడుతోంది. అయితే ఫుల్ రన్ లో ఈ మార్క్ అందుకోవడం కాస్త కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అందుకు కారణం ఇప్పటికే సంక్రాంతి సీజన్ తో పాటు రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ ముగియడంతో వీక్ డేస్ లో హనుమాన్ 300 కోట్ల మైలు రాయిని టచ్ చేసే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. ఈ వారంలో తెలుగులో కొత్త సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో, మరికొన్ని రోజులు హనుమాన్ హవా నడిచే అవకాశం ఉంది. అటు హిందీలో 'ఫైటర్' మూవీ పోటీలో ఉన్నప్పటికీ, ఈ సినిమా స్టడీగా కలెక్షన్స్ రాబడుతుండడం విశేషం.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: