విగ్నేష్ శివన్ ను.. నయనతార ఆ కండిషన్ తో పెళ్లి చేసుకుందట తెలుసా?

praveen
సౌత్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇక అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది. ఇక ఇప్పటికే అందరూ యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో జోడి కట్టి కోట్లాదిమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇక ఇతర హీరోల సరసన నటిస్తూ సూపర్ హిట్లు కొడుతుంది.

 అయితే సినిమాలతో ఎంత అయితే పాపులారిటీ సంపాదించుకుందో ఇక ప్రేమాయణాలతో  కూడా అంతే వార్తల్లో నిలిచింది నాయనతార. ఎంతో మందితో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ చివరికి విగ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే సరోగసి పద్ధతి ద్వారా ఈ జంట ఇద్దరు కవలలకు తల్లిదండ్రులుగా మారిపోయారు. అయితే ప్రస్తుతం నాయనతార వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అని చెప్పాలి. అలాగే కొన్ని ఇటీవల కాలంలో కొన్ని వివాదాలలో కూడా చిక్కుకుంది. కాగా నయనతారకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది.

 విగ్నేష్ శివన్ తో ఎన్నో రోజులపాటు ప్రేమలో మునిగితేలి పెళ్లి చేసుకున్న నయనతార పెళ్లికి ముందు ఓ కండిషన్ పెట్టిందట. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇండస్ట్రీకి దూరం కాను  ఎప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. దానికి నువ్వు పెళ్లి అయిన తర్వాత అడ్డు చెప్పకూడదు. అలా అయితేనే పెళ్లి చేసుకుంటాను అని ఒక కండిషన్ పెట్టిందట. అయితే విగ్నేష్ శివన్ కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే కావడంతో ఇందుకు అంగీకరించాడట. దీంతో ఇక వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: