టాలీవుడ్ పై సీక్వెల్స్ దాడి !

Seetha Sailaja
సినిమా కధలకు కొరత ఏర్పడటంతో హీరోలు దర్శక నిర్మాతలు ఇలా అందరు హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసే పనిలో బిజీగా ఉన్నారు. ఏసీనిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో తలలు పండిన వారికి కూడ తెలియని పరిస్థితులలో హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడమే రిస్క్ లేని పని అంటూ చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు భావిస్తున్నారు.



ఈసంవత్సరం విడుదలకాబోయే సీక్వెల్స్ సినిమాలలో అత్యంత భారీ అంచనాలు ఉన్నది. ‘పుష్ప 2’ పైనే ఆగష్టు 15న విడుదల కాబోతున్న ఈ మూవీతో బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేయాలని బన్నీ భావిస్తున్నాడు. ఇక ఈ సీక్వెల్స్ లిస్టులో అంచనాలు బాగా ఉన్న మరొక సినిమా ‘టిల్లు స్క్వేర్’ సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈ మూవీతో సిద్దూ జొన్నలగడ్డ యూత్ కు మరింత దగ్గర కాబోతున్నాడు.



గత సంవత్సరం క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదలైన ‘సలార్’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీకి 500 కోట్ల కలక్షన్స్ రావడంతో ఇప్పుడు ‘సలార్ 2’ పై ఒత్తిడి పెరుగుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీ ఈసంవత్సరం మళ్ళీ క్రిస్మస్ రేస్ కు వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈసినిమాలు కాకుండా ‘హనుమాన్ 2’ ‘అఖండ 2’ ‘గూఢచారి 2’ ‘హిట్ 3’ ‘బింబిసార 2’ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ‘కార్తికేయ 3’ ‘విరూపాక్ష 2’ ‘శతమానం భవతి 2’ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడ జరుగుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.


ఇది ఇలా ఉండగా మార్చిలో రిలీజ్ కాబోతున్న పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో రిలీజ్ కాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సీక్వెల్ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి క్రియేటివిటీతో కథలు వ్రాయగల ఎందరో మంచి రచయితలు మన ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ దర్శక నిర్మాతలు ఆడుతున్న సేఫ్ గేమ్ వల్ల సీక్వెల్స్ హడావిడి పెరుగుతోంది అనుకోవాలి..









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: