ఆ రోజున డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రానున్న రొమాంటిక్ మూవీ....!!

murali krishna
ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుల కోసం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తున్నాయి..తాజాగా ఈ ఏడాది వాలంటైన్స్ డేకు  స్పెషల్‌గా “సబా నాయగన్”అనే ఓ రొమాంటిక్ మూవీ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ లో కలర్ ఫొటో హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించింది. భద్రమ్, మన్మధ లీల, పోర్ తొళిల్ మరియు పిజ్జా 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశోక్ సెల్వన్. అతను నటించిన అనేక తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. దాంతో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు బాగానే సుపరిచితుడే.అశోక్ సెల్వన్, చాందినీ చౌదరి నటించిన ఈ లేటెస్ట్ మూవీ సబా నాయగన్. 2023లో డిసెంబర్‌లో విడుదలైన సబా నాయగన్ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించారు.సబా నాయగన్ మూవీలో అశోక్ సెల్వన్ మరియు చాందినీ చౌదరితో పాటు మరో హీరోయిన్స్‌గా మేఘా ఆకాష్ మరియు కార్తీక మురళీధరన్ నటించారు.. ఈ సినిమాతో సీఎస్ కార్తికేయ దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఆయన గతంలో కమల్ హాసన్ విశ్వరూపం, విశ్వరూపం 2 చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.. గతేడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సబా నాయగన్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.ఈ ఏడాది ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ఈ రొమాంటిక్ డ్రామా అయిన సబా నాయగన్‌ను విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 14 నుంచి సబా నాయగన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఇంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి సబా నాయగన్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ చేస్తే మేకర్స్‌కు మరియు ఓటీటీ సంస్థకు కలిసి వస్తుందని వాయిదా వేసి వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: