బాలీవుడ్ రామాయణ్ లో విజయ్ సేతుపతి .. ఏ పాత్ర అంటే..?

Divya
రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు.  దంగల్ దర్శకుడు నితీష్ తివారి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే హిందీ రామాయణ్ కి సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతున్న విషయం తెలిసిందే . ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా.. రావణాసురుడిగా నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే .. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో విషయం వైరల్ గా మారుతుంది.

 కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి ఈ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. రామాయణం లోని ప్రధాన పాత్రల్లో ఒకటైన విభీషణుడి పాత్రలో నటించడానికి విజయ్ సేతుపతికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది . విజయ్ సేతుపతి నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర ఇచ్చినా సరే దానికి ప్రాణం పోస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటూ ఉంటారు. ఇక సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నార ముఖ్యంగా షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి పోషించిన పాత్ర హిందీ జనాలకు బాగా చేరువయ్యింది . అందుకే ఇప్పుడు బాలీవుడ్ మూవీ రామాయణ్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో విజయ్ సేతుపతి కాల్ షీట్స్ అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇకపోతే ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న హనుమాన్ టీం కూడా విజయసేతుపతికి విభీషణ్ పాత్రకు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే కొన్ని కారణాలవల్ల ఆ పాత్ర సముద్రఖనికి వెళ్లిపోయింది.. ఇప్పుడు అదే పాత్ర కోసం దర్శకుడు నితీష్ తివారి విజయ్ సేతుపతికి ఆఫర్ ఇచ్చారు. మరి విభీషణుడి రోల్ కోసం విజయ్ సేతుపతి ఒప్పుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ విషయం కాస్త వైరల్ గా మారుతుంది. ఇక మార్చి నెలలో ఈ సినిమా షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: