బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన 'ఫైటర్' సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సంవత్సరం బాలీవుడ్ నుంచి థియేటర్స్ లో విడుదలైన మొదటి బిగ్ మూవీ ఇదే. కానీ అందుకు తగ్గట్లు మేకర్స్ ఆడియన్స్ లో రిలీజ్ కు ముందు ఈ సినిమాపై హైప్ ని క్రియేట్ చేయలేకపోయారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.అయితే మూవీ టీమ్ కంటెంట్ పై ఉన్న నమ్మకంతో మౌత్ టాక్ సినిమాకి ప్లస్ అవుతుందని మేకర్స్ ఆశించారు.ఈ సినిమా విడుదలకు ముందు ఫైటర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే అందుకు కారణం ప్రమోషన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవడమే. గురువారం నాడు మధ్యాహ్నం కేవలం 10% ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ లో రన్ ఐన ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మాములుగా ఇలాంటి పెద్ద సినిమాలకు మార్నింగ్ షో పాజిటివ్ టాక్ వస్తే ఆ తర్వాత షోలకి ఆక్యుపెన్సి అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఫైటర్ సినిమా విషయంలో అలా జరగలేదు. ఈ సినిమాకి మంచి రివ్యూస్ ఉన్నా కూడా ఈవినింగ్, నైట్ షోలకి కేవలం 20% నుంచి 25% మాత్రమే ఆక్యుపెన్సి కనిపించింది.అందువల్ల 'ఫైటర్' ఇండియా వైడ్ గా కేవలం 20 కోట్ల ఓపెనింగ్స్ కాబట్టి నిరాశపరిచింది.నిజానికి ఫైటర్ సినిమాని లాంగ్ వీకెండ్ చూసుకొని రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే నేషనల్ హాలిడే కావడంతో సినిమాకి రెండో రోజు ఆక్యుపెన్సి పెరగాలి. చివరికి అది కూడా జరగలేదంటే ఫైటర్ టీమ్ కి ఖచ్చితంగా నిరాశ తప్పదు. ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని బాలీవుడ్ యాక్షన్ సినిమా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించారు.బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్ ఇంకా సంజీదా షేక్ కీలకపాత్రలు పోషించారు. ఫస్ట్ ఇండియన్ ఏరియల్ యాక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది. మేకర్స్ కూడా ఈ ఒక్క సినిమాతో ఆగకుండా ఓ ఫ్రాంచైజీనే చేశారు. ఈ ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని సినిమాలు తీస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.