సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయిన రాంచరణ్ మూవీ అదేనా....!!

murali krishna
టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు చరణ్ అంటేనే ఓ గ్లోబల్ స్టార్ అన్న బిరుదు వచ్చేసింది.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్‌ఛేంజర్ సినిమాలో నటిస్తోన్న చరణ్ ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.ఇక చరణ్ ను టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోను చేసిన సినిమా రెండో సినిమా మగధీర. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా 100 రోజులు ఆడి వసూళ్ల పరంగా దుమ్ముదులిపేసింది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో ఓడిపోయాక వచ్చి ఇండస్ట్రీ రికార్డు కొట్టడంతో చిరు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మగధీర సినిమాలో రాజకుమారి పాత్రలో కాజల్ నటించింది. రాజమౌళి కాజల్ - చెర్రీపై ఫొటో షూట్ చేశాక.. రాకుమారి పాత్రలో కాజల్ అయితేనే పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందని డిసైడ్ ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో పాటు రామ్‌చరణ్‌ను టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోగా నిలబెట్టడంతో కాజల్ విషయంలో చరణ్‌కు బాగా సెంటిమెంట్ పట్టుకుందట.తర్వాత సినిమాలోనూ కాజల్‌ను కావాలని పట్టుబట్టి మరీ హీరోయిన్‌గా తీసుకునేలా చక్రం తిప్పారు. ఆ సినిమా పేరు మెరుపు. శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఏఎం. రత్నం ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో బంగారం సినిమా తీసిన తమిళ దర్శకుడు ధరణి ఈ సినిమాకు డైరెక్టర్‌. సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. చరణ్ .. తన ఫేవరెట్ సెంటిమెంట్ హీరోయిన్‌తో మరో హిట్ కొట్టాలని కలలు కని మరీ ఈ సినిమాలోను ఆమెను హీరోయిన్‌గా పెట్టించాడు.
బ్యాడ్‌లక్ ఏంటంటే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత ఐదేళ్లకు మళ్లీ రామ్‌చరణ్ గోవిందుడు అందరివాడేలే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కాజల్‌ను సెట్ చేసేలా చక్రం తిప్పాడట. ఆ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఆ టైంలో ఆయనకు చరణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడమే ఎక్కువ. వెంటనే చరణ్‌.. డైరెక్టర్‌పై ఒత్తిడి చేసి కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని చెప్పడంతో చెర్రీ నిర్ణయానికే కృష్ణవంశీ ఓటేసి కాజల్‌ను ఆ సినిమాలో హీరోగా పెట్టాడు. ఫ్యామిలీ స్టోరీగా వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమా అంచనాలు అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: