మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా పైనే నమ్మకం పెట్టుకున్న త్రివిక్రమ్..!?

Anilkumar
త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాత తన 30వ సినిమాని కూడా ఆయన దర్శకత్వంలోనే చేయాలి అని అనుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా త్వరలోనే రాబోతోంది అని దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది అని అన్నారు. అంతేకాదు ఈ సినిమాకి టైటిల్ కూడా ఇదే అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో టైటిల్ను ప్రచారం కూడా చేస్తున్నారు.

కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఆ స్థానంలో తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రావాల్సిన రెండవ సినిమా ఆగిపోయింది. కానీ భవిష్యత్తులో నిజం కావాలి అని అనుకుంటున్నారు. అది కూడా అత్యంత భారీ స్థాయిలో ఉంటుంది అని ఇదివరకే నిర్మాత నాగ వంశీ కొన్ని సందర్భాల్లో వెల్లడించారు కూడా. త్వరలోనే 'దేవర' షూటింగ్ పూర్తి చేసి, ఆ వెంటనే బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కానున్నాడు తారక్.

దీని తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు, 'దేవర-2' లైన్ లో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఈ ఏడాది పట్టాలెక్కాల్సి ఉండగా, ఇప్పుడది వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'సలార్' వచ్చింది. దానికి పార్ట్-2 కూడా ఉంది. అలా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి టైం పట్టే అవకాశముండటంతో ఈ గ్యాప్ మరో సినిమా చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఈ క్రమంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో నిర్మాత నాగవంశీ ఉన్నాడట. ఇటీవల 'గుంటూరు కారం'తో షాక్ తిన్న త్రివిక్రమ్. అల్లు అర్జున్ తో ఒక సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: