జాన్వీకపూర్ పాత్ర గూర్చి వస్తున్న న్యూస్ పై స్పష్టత ఇచ్చిన 'దేవర' టీం...!!

murali krishna
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా రిలీజ్ కు మరో 70 రోజుల సమయం మాత్రమే ఉంది.అయితే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తక్కువ డేట్స్ కేటాయించిందని ఈ సినిమా లో జాన్వీ కపూర్ కొంత సమయం మాత్రమే కనిపిస్తుందని సోషల్ మీడియా వేదిక గా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వార్తల గురించి టీమ్ నుంచి స్పష్టత వచ్చేసింది.వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని దేవర సినిమా లో జాన్వీ కపూర్ పాత్రకు ఎక్కువ గానే ప్రాధాన్యత ఉండనుందని క్లారిటీ వచ్చేసింది. జాన్వీ కపూర్ సైతం హీరోయిన్ గా నా తొలి సినిమా దేవర అని ఒక సందర్భంలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటీనటులు కూడా దేవర లో నటించడం తో ఈ సినిమా పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా డిజిటల్ రైట్స్ రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయి.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు గట్టి పోటీ ఉందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమా కు పోటీగా కొన్ని తమిళ సినిమాలు రిలీజవుతుండగా తెలుగు రాష్ట్రాల నుంచి దేవర సినిమా కు పోటీ గా ఏ సినిమా అయినా విడుదలవుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ఏడాది క్రితమే దేవర మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.99 శాతం ఈ సినిమా రిలీజ్ డేట్ మారే చాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా కోసం కొరటాల శివ పడుతున్న కష్టం అంతాఇంతా కాదని తెలుస్తోంది. ఈ సినిమా డైలాగ్స్ విషయంలో కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని భోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: