డబ్బింగ్ వార్ విజేత ఎవరు !

Seetha Sailaja
లేటెస్ట్ గా ముగిసిన సంక్రాంతి వార్ లో ఎవరు ఊహించని విధంగా ‘హనుమాన్’ ప్రధమ స్థానంలో నిలిస్తే ద్వితీయ స్థానయంలో ‘నా సామిరంగ’ నిలబడింది. సుమారు 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తెచ్చుకుని కూడ ‘గుంటూరు కారం’ ఫైయిల్యూర్ ముద్రతో సరిపెట్టుకోవాలసి వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా తగ్గి పోవడంతో వచ్చే వారం రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కాబోయే డబ్బింగ్ సినిమాల వార్ పై అందరి దృష్టి కొనసాగుతోంది.

బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మూవీ పై అంచనాలు బాగా ఉన్నాయి. ఈ సినిమాతో పాటు తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన  ‘ఆయలాన్’ మూవీ కూడ విడుదల కాబోతోంది. అనుకోకుండా తమ ఊరిలోకి వచ్చిన ఒక గ్రహాంతర వాసితో హీరో శివకార్తికేయన్ స్నేహం చేయడం ఆతరువాత వారిద్దరు విడిపోవడం ఇలాంటి అంశాలను దర్శకుడు ఈ మూవీలో చాల బాగా చూపించాడు అన్న ప్రీ రిలీజ్ టాక్ కూడ ఈ మూవీ పై ఉంది.

ఈమధ్య కాలంలో భారీ అంచనాలతో వచ్చిన టాప్ హీరోల సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి రిపబ్లిక్ చేస్తూ విడుదల కాబోతున్న రిపబ్లిక్ డే ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్న ఈ డబ్బింగ్ సినిమాల విజేత ఎవరు అన్న ఆశక్తి చాలమందిలో ఉంది. ఈమధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగ మారిపోవడంతో అనుకోకుండా కొన్ని డబ్బింగ్ సినిమాలు కలక్షన్స్ విషయంలో సునామిని సృష్టిస్తున్నాయి.

మన తెలుగు డబ్బింగ్ సినిమలను తమిళ్ ప్రేక్షకులు ఆదేవిధామగ కన్నడ ప్రేక్షకులు పెద్దగా చూడనప్పటికీ మన తెలుగు వారు మటుకు విశాల హృదయంతో డబ్బింగ్ సినిమాలను ఆదరిస్తున్నారు అన్నదానికి ఉదాహరణ ‘కాంతార’ ఘన విజయం. దీనితో ఈ రిపబ్లిక్ డేకి రాబోతున్న ఈ డబ్బింగ్ సినిమాలలో ఏసీనిమాను మన తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అన్నది వచ్చే వీకెండ్ కు తెలిపోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: