జక్కన్న నటించిన సినిమాల లిస్ట్ తెలుసా.....??

murali krishna
టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు తెరకెక్కించగా ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఒకదాన్ని మించి ఒకటి రికార్డుల మూత మోగించాయి. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనుడు జక్కన్న. మరి జక్కన్న క్యామియో రోల్ పోషించిన చిత్రాలు 8 ఉన్నాయంటే నమ్ముతారా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన 8 చిత్రాల్లో కనిపించారు.ఇంతకీ ఆ ఎనిమిది సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మొదటగా ఎన్టీఆర్ తో కలిసి స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం తెరకెక్కించగా ఆ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో కలిసి సింహాద్రి సినిమాను తెరకెక్కించగా అది కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. ఇక మూడో చిత్రం నితిన్ తో కలిసి సై చిత్రం తెరకెక్కించి హాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక ఆ తర్వాత 4వ చిత్రం ప్రభాస్ తో కలిసి ఛత్రపతి తెరకెక్కించి రికార్డులు బ్రేక్ చేశాడు. తర్వాత ఇక 5వ చిత్రం మాస్ మహారాజా రవితేజతో కలిసి విక్రమార్కుడు తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో కలిసి యమదొంగ చిత్రాన్ని తెరకెక్కించి డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు.ఇక ఆతర్వాత రామ్ చరణ్ తో కలిసి మగధీర తెరకెక్కించి ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఈ సినిమాలన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ గా నిలిచాయి.  హీరో సునీల్ తో కలిసి మర్యాద రామన్నా,నానితో ఈగ చిత్రాలు తీసి హీరోలు లేకపోయిన హిట్ కొట్టగలడని నిరూపించాడు జక్కన్న. ఇక 10, 11 చిత్రాలు బహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాతోనే పాన్ ఇండియా చిత్రాలు తెలుగులో వచ్చాయి.బహుబలి సిరీస్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రం తీసి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు జక్కన్న. అయితే జక్కన్న 12 చిత్రాల తీయగా 8 చిత్రాల్లో కనిపించారనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమాలు ఏంటంటే.. మొదటి సారిగా సై చిత్రంలో వేణుమాధవ్ అనుచరుడి పాత్రలో కనిపించారు.
ఇక ఈచిత్రం తర్వాత రెయిన్ బో అనే చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించారు.ఆ తర్వాత మగధీర అనగనగనగా పాటలో క్యామియో ఇచ్చారు జక్కన్న. ఇక ఈగ చిత్రానికి మొదట్లో కథను చెప్పేది రాజమౌళినే.ఇక 5వ చిత్రం బహుబలి చిత్రంలో సారా అమ్మే వ్యక్తిగా కనిపిస్తాడు. ఇక ఆతర్వాత మజ్ను చిత్రంలో డైరెక్టర్ గా క్యామియోలో కనిపిస్తాడు. ఇక 7వ చిత్రం రాధే శ్యామ్ లో కూడా కథను మొదలు పెట్టేది రాజమౌళినే. ఇక 8వ చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎత్తర జెండా పాటలో కనిపిస్తారనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: