కలలో కూడా ఊహించని డైరెక్టర్ తో.. పవన్ కళ్యాణ్ మూవీ?

praveen
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కనీసం ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా అటెండ్ అవ్వలేని పొజిషన్లో ఉన్నారు. అయితే ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారట.

 పవర్ స్టార్ అభిమానులు కనీసం కలలో కూడా ఊహించని డైరెక్టర్లతో ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాకు ఓకే చేశాడు అన్న వార్త ఒకటి ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లిస్టులో ఇప్పటికి హరీష్ శంకర్, క్రిష్, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్లు ఉన్నారు. అయితే జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ను కలిసిన అట్లీ కథను వినిపించాడట. అయితే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో పవన్ కళ్యాణ్ కూడా వెంటనే ఓకే చెప్పేసాడట.

 అయితే కచ్చితంగా మనం కలిసి పని చేద్దాం. కాకపోతే కొంచెం సమయం వేచి ఉండాలి అంటూ చెప్పాడట పవన్ కళ్యాణ్. అయితే మీకోసం ఎన్ని సంవత్సరాలు అయినా వేచి ఉంటాను సార్ అని అట్లీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ కు స్టోరీ లైన్ నచ్చడంతో ఇక అట్లీతో సినిమా చేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడట.  ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం జవాన్ ను మించిన సూపర్ హిట్ సాధించడం ఖాయం అన్నది తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కుదిరితే ఇక లైన్లో ఉన్న ముగ్గురు డైరెక్టర్లను పక్కనపెట్టి అట్లీతో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని సినీ విశేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: