వార్నింగ్ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య....!!

murali krishna
తాను కొత్త బాడీగార్డ్ ని నియమించుకున్నాను అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. అదేంటి రేణూ దేశాయ్ ఇప్పటికిప్పుడు కొత్త బాడీగార్డ్ ని ఎందుకు నియమించుకోవాల్సి వచ్చింది అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.కానీ అసలు విషయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఒకప్పటి హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సమాజం గురించి, అనేక విషయాలు మీద స్పందిస్తూ ఉంటారు. అంతేగాక తన పిల్లలు ఆధ్యా అకీరా నందన్ గురించి కూడా అనేక విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. అయితే రేణు దేశాయ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో ఆసక్తికరంగా మారింది.ఈ సమయంలోనే ఆద్య కిక్ బాక్సింగ్ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోని షేర్ చేసింది. ఇక ఆ వీడియోపై... నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నా కొత్త పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ తో మీకు ఇబ్బందులు తప్పవు... అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఆద్య కుంఫు, కరాటే లాంటి సెల్ఫ్ డిఫెన్స్ క్రీడలు నేర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే సరదాగా తల్లితో ఇలా చేయడంతో ఆమె వీడియో షేర్ చేశారు.
అయితే కొద్ది రోజుల క్రితం మెగా ఫ్యామిలీ అంతా బెంగళూరు ఫామ్ హౌజ్ లో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలోనే వారితో పాటు ఆద్యా, అకీరా కూడా ఉన్నారు. అదే సమయంలో అకీరా పియానో ప్లే చేసిన కొన్ని సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడాలని కోరిక ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని గతంలో రేణు దేశాయ్ కూడా పేర్కొన్నారు.తనకు తన కొడుకు హీరో అవ్వాలని ఉంది కానీ ఆయన మ్యూజిక్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు అని రేణు దేశాయ్ గతంలో చెప్పుకొచ్చింది. ఈ లెక్కను చూస్తే తమ అభిమాన హీరో వారసుడు... హీరో అవ్వకుండా ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు అని ఆయన అభిమానులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఆరడుగుల హైట్ తోటి టాలీవుడ్ లో ఎవరూ లేరు అన్నంత పొడుగ్గా అకిరా కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయన హీరో అయితే మాత్రం కొత్త రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక రామ్ చరణ్ తో ఆధ్యా, అకీరా ఇద్దరూ బాండింగ్ చూస్తే భలే ఉందంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే... ఈ మధ్యనే ఆమె టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హేమలత లవణం అనే క్యారెక్టర్ లో మెరిసింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో ఆమె తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అయితే అందరిలో ఉంది చూడాలి. మరి ఏం జరగబోతోందనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: