గుంటూరు కారం: ఆల్ టైం రికార్డులు కొడుతున్న మహేష్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి రిలీజయి  నెగటివ్ టాక్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.మూవీ యూనిట్ ఆల్రెడీ మహేష్ బాబు ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. కామెడీ, లవ్, అమ్మ సెంటిమెంట్ ఇంకా మహేష్ మాస్ మేనియాతో గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులని విపరీతంగా మెప్పిస్తుంది.ఇక వసూళ్లలో కూడా గుంటూరు కారం సినిమా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రీజనల్ సినిమాతో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఆల్ టైం రికార్డ్ రికార్డ్ సెట్ చేసింది. కేవలం వారం రోజుల్లో గుంటూరు కారం సినిమా 212 కోట్ల గ్రాస్  వసూలు చేసింది. 



తాజాగా మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క భాషలోనే రిలీజయిన ఒక రీజనల్ సినిమా పైగా ఫుల్ నెగటివ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడం ఇదే మొదటి సారి. ఈ సినిమాతో మహేష్ తన స్టార్ డం ఏంటో చూపించి తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. అంతేకాకుండా ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ కూడా దక్కించుకుంది. దీంతో వరుసగా 5 రీజనల్ సినిమాలతో 100 కోట్లు షేర్ దక్కించిన ఏకైన సౌత్ హీరోగా కూడా మహేష్ బాబు రికార్డ్ సెట్ చేసాడు. రీజనల్ సినిమాలతోనే మహేష్ ఈ రేంజ్ లో రికార్డులు సెట్ చేస్తుంటే ఇక నెక్స్ట్ రాజమౌళి సినిమా  పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో ఏ రేంజ్ లో రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: