2వ రోజు హనుమాన్ కి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్..!

frame 2వ రోజు హనుమాన్ కి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యింది. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే అదిరిపోయే రేంజ్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి 2 రోజుల్లో నైజాం ఏరియాలో 5.55 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.53 కోట్లు ఉత్తరాంధ్ర లో 1.57 కోట్లు , ఈస్ట్ లో 1.22 కోట్లు , వేస్టు లో 70 లక్షలు , గుంటూరు లో 83 లక్షలు , కృష్ణ లో 56 లక్షలు , నెల్లూరు లో 37 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.33 కోట్ల షేర్ , 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి లాంగ్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లు దక్కే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: