
ఆ హీరో అంటే ఎంతో ఇష్టం.. ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా : రష్మిక
అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ అదరగొడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల యానిమల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టాలీవుడ్ టాప్ హీరో అటు అల్లు అర్జున్ సరసన పుష్ప 2 అనే సినిమాలో కూడా నటిస్తూ ఉంది రష్మిక మందన్న. అయితే రష్మిక సినిమాల్లో చలాకీగా కనిపించడమే కాదు రియల్ లైఫ్ లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అభిమానులు అందరితో కూడా ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే తన ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చింది. ఆయనతో ఒక్కసారి కలిసి నటించే ఛాన్స్ వచ్చిన చాలు అంటూ మనసులో మాట బయట పెట్టింది రష్మిక. ఇంతకీ రష్మిక ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ఆయన ఎవరో కాదు త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటన చాలా అద్భుతంగా ఉంటుందని.. ఆయన నటన చూస్తూ ఉంటే అలాగే ఉండిపోతాను అంటూ రష్మిక తెలిపింది. ముఖ్యంగా తారక్ డాన్స్ అంటే ఎంతో ఇష్టం అంటూ రష్మిక తెలిపింది. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్న.