'గుంటూరు కారం' పై కాపీ మరక..!

Anilkumar
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం' ఈ సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ తన సినిమాలతో క్లాస్ టచ్ ఇచ్చే త్రివిక్రమ్ ఈసారి మహేష్ తో ఊర మాస్ సినిమా చేస్తున్నాడు. రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు లీకుల ద్వారా బయటికి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే, గుంటూరు కారం సినిమాని త్రివిక్రమ్ ఓ నవల ఆధారంగా తెరకెక్కించారట. 

యద్దనపూడి సులోచనారాణి రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవల నుంచి గుంటూరు కారం కథను త్రివిక్రమ్ కాపీ కొట్టినట్లు కొన్ని ఓ ప్రముఖ వెబ్సైట్ వార్తను ప్రచారం చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది. అయితే తాజాగా ఇదే విషయమై స్పందించిన నిర్మాత నాగ వంశీ ఈ న్యూస్ ని ప్రచారం చేసిన సదరు వెబ్ సైట్ కి కౌంటర్ గా ఆ వెబ్ సైట్ ని ట్యాగ్ చేస్తూ టిఆర్పి ని పెంచడం కోసం ఆ వెబ్సైట్ ఇలాంటి న్యూస్ ని స్ప్రెడ్ చేసినట్లు అర్ధం వచ్చేలా ఓ వీడియోని  షేర్ చేసాడు. దాంతో సదరు వెబ్సైట్ కి నాగ వంశీ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

 గుంటూరు కారం విషయంలో ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వినిపించినా మహేష్, త్రివిక్రమ్ ల కంటే ముందు నాగ వంశీని రెస్పాండ్ అవుతూ వస్తున్నాడు. సోషల్ మీడియాలో అయినా, బయట మీడియాతో అయినా ఇంట్రాక్ట్ అయినా ప్రతిసారి 'గుంటూరు కారం' పై ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశారు. నిన్ననే గుంటూరు మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న విషయాన్ని నాగవంశీ షేర్ చేస్తూ.." సినిమా చూడగానే మజా వస్తుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఈల వేయాలని అనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ బొమ్మ లోడింగ్ జనవరి 4 డేట్ గుర్తు పెట్టుకోండి" అంటూ పోస్ట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: