రెండో పెళ్లిపై నోరు ఎత్తకుండా చేసిన మీనా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్డం అందుకున్న సీనియర్ హీరోయిన్లలో మీనా కూడా ఒకరు.. హీరోయిన్గా ఆఫర్లు తగ్గినప్పటికీ అందరి హీరోయిన్స్ లాగానే పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లో స్థిరపడిపోయింది. అయితే దురదృష్టవశాత్తు మీనా భర్త హఠాత్తుగా మరణించడంతో ఇమే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఇప్పుడిప్పుడే ఈ విషయం నుంచి బయటపడుతూ తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నటువంటి మీనా చాలామంది రెండో పెళ్లి విషయం పైన పలు రకాలు ప్రశ్నలతో ఆమెని విసిగిస్తున్నారు.. తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న ఈమె అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా పదేపదే ఈ విషయం పైన ప్రశ్నించారు.
ఇకమీదట ఎవరు ఇలాంటి ప్రశ్న అడగకుండా ఒక దిమ్మతిరిగే సమాధానం తెలియజేసింది మీనా.. తన జీవితంలో ఏదీ కూడా ముందుగా ప్లాన్ చేసుకోలేదని కాలంతోపాటు తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నానని ప్రతిసారి తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో కెరియర్లు ఎన్నో విజయాలను సాధించుకుంటూ వచ్చాను అంటూ తెలిపింది. ఇక రెండో పెళ్లి విషయంపై చాలామంది ప్రశ్న అడుగుతున్నారు ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం లేదని..

భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది తనకు తెలియదని ఇప్పుడు నా దృష్టి మొత్తం తన కూతురి భవిష్యత్తు మీదే ఉందంటూ తన తండ్రి లేని లోటుని తెలియకుండా పెంచడమే తనకి ముఖ్యమని తెలియజేసింది.. తాను జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలనుకోలేదు అలా అని ఇప్పుడే తోడు కావాలని కోరుకోవడం లేదు అన్నట్లుగా మీనా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.. కాలం ఎటు వెళ్తే అటు నేను కూడా వెళ్తాను అన్నట్టుగా తెలియజేయడం జరిగింది మీనా.. మీనా కూతురు పెద్దయ్యాక ఆ సమయంలో తనకు తగ్గ తోడు దొరికితే అతనితో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటే అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తుందేమో అన్నట్లుగా ఈమె మాటలను బట్టి అర్థమవుతోంది. సినిమాలలో మంచి పాత్రలు వస్తే రీ యంట్రి ఇస్తానన్నట్టుగా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: