'జవాన్' రికార్డ్ ని 'పుష్ప 2' బ్రేక్ చేస్తుందా?

frame 'జవాన్' రికార్డ్ ని 'పుష్ప 2' బ్రేక్ చేస్తుందా?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప ది రూల్‌’. పార్ట్-1 భారీ సక్సెస్ అవ్వడంతో సీక్వెల్‌ పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక చిత్ర బృందం సైతం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఫ్యాన్స్ అంచ‌నాల‌కు మించి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్స్ పోస్ట‌ర్లు, గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో ప్రారంభయ్య స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేషనల్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే రిలీజ్ కి ముందే 'పుష్ప 2' సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షో ఇటీవల ఓ సరికొత్త ఫీచర్ ని ప్రకటించింది. దాని ప్రకారం ఇండియాలో ప్రతి గంటలో మొత్తంగా ఎన్ని టికెట్స్ అమ్మకం జరిగిందని తెలుసుకోవచ్చు. అలా ఇప్పటివరకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' మూవీ ఒకానొక సమయంలో కేవలం గంటలోనే 86,000 టికెట్స్ అమ్మకం జరిగింది. దాంతో జవాన్ ఈ విషయంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. తర్వాత రెండవ స్థానంలో రణబీర్ కపూర్ 'యానిమల్' మూవీ ఒక గంటలో 84 వేల టికెట్స్ అమ్ముడయ్యి రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'పుష్ప 2' పై అందరిలో భారీ హైప్ ఉండటంతో బుక్ మై షో లో హైయెస్ట్ టికెట్స్ అమ్మకాల రికార్డును ఈ మూవీ అధిగమిస్తుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ లో జవాన్ ఉండగా ఖచ్చితంగా జవాన్ రికార్డును 'పుష్ప 2' బ్రేక్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ పుష్ప2 క్రేజ్ ఆకాశాన్ని తాకింది. అటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. కాబట్టి సినిమా నుంచి రిలీజ్ అయ్యే ప్రమోషనల్ కంటెంట్ అంచనాలకు తగ్గట్టుగా ఉండి, ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటే కచ్చితంగా 'పుష్ప 2' బుక్ మై షో గంటకు లక్ష టికెట్లను దాటే అవకాశం ఉందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: