పెళ్లికి సిద్ధం అవుతున్న మలయాళ ముద్దుగుమ్మ ....!!

murali krishna
కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌ సంయుక్త మీనన్‌.. త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ఆమె అందుకోసం ముందుగానే ప్రిపేర్‌ అవుతుందట. అందుకు సంబంధించిన లాజిక్‌ చెబుతున్నారు నెటిజన్లు.మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌.. తెలుగులో మంచి విజయాలు అందుకుంది. ఇంకా చెప్పాలంటే ఆమె పట్టిదల్లా బంగారం అనేలా ఆమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. భీమ్లా నాయక్‌ ఫర్వాలేదనిపించింది. బింబిసార హిట్‌ అయ్యింది. సార్‌ మూవీ పెద్ద హిట్‌. ఆ తర్వాత చేసిన విరూపాక్ష పెద్ద హిట్‌ అయ్యింది.కళ్యాణ్‌ రామ్‌తో కలిసి మరో సినిమా చేస్తుంది. `బింబిసార`తోపాటు `డెవిల్‌`లోనూ హీరోయిన్‌గా చేసింది. కానీఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. సరిగ్గా తీస్తే ఇది కూడా హిట్‌ మూవీ అయ్యింది. దర్శకుడు, నిర్మాత మధ్య విభేదాలు సినిమా రిజల్ట్ తేడా కొట్టేలా చేసింది. ఇలా తెలుగులో సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది సంయుక్త మీనన్‌.కానీ ఇంతలోనే పెద్ద షాకిస్తుంది ఈ బ్యూటీ. త్వరలో పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన రూమర్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ఏడాది సంయుక్త మీనన్‌ పెళ్లి పీఠలెక్కబోతుందని అంటున్నారు. అయితే సంయుక్త మీనన్‌ అందుకు సంబంధించిన హింట్‌ కూడా ఇస్తుంది. దీనికి సంబంధించిన లాజిక్‌ బయటపెడుతున్నారు నెటిజన్లు.
 సంయుక్త మీనన్‌ ఇప్పటి వరకు నటించిన సినిమాలు గతంలో ఒప్పుకున్న మూవీస్. ఇటీవల కాలంలో ఆమె కొత్తగా మరే సినిమాకి సైన్‌ చేయలేదు. కొత్తగా ఏ మూవీని ప్రకటించలేదు. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ సంయుక్త మీనన్‌ సినిమాలు చేయడం లేదు.మరి సినిమాలకు గ్యాప్‌ తీసుకుంటుందా? లేక సెలక్టీవ్‌గా వెళ్తుందా? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఈ లాజిక్‌నే పట్టుకుని సంయుక్త మీనన్‌ పెళ్లి చేసుకోవాలనుకుంటుందని, అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదని, ఇప్పుడు ఆమె చేతిలో కొత్తగా మరేసినిమా లేదని అంటున్నారు. లాజికల్‌గా ఆమె యాక్టివిటీస్‌ని చూసి నెటిజన్లు ఈ కామెంట్‌ చేస్తుంది. మరి నిజం ఏంటనేది మాత్రం ఆమెకే తెలియాలి. ఆమె ఓపెన్‌ అవుతూనే వాస్తవం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: