తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ బ్యూటీలలో ఆశకా రంగనాధ్ ఒకరు. ఈమె కొంత కాలం క్రితం కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన అమిగోస్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేక పోయినప్పటికీ ఈ నటికి ఈ మూవీ ద్వారా పర్వాలేదు అనే స్థాయిలో గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న నా సామి రంగా అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈయన ఈ సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే ఏ తేదీన ఈ మూవీ ని విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 14 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇకపోతే సినిమాలలో పర్వాలేదు అనే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎక్కువగా తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఓలకబోసేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.