తండెల్.. నాగచైతన్య అలా.. సాయి పల్లవి ఇలా..?

Divya
హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు అక్కినేని హీరో నాగచైతన్య.. చివరిగా కస్టడీ అనే సినిమాలో నటించగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.ఆ తర్వాత విడుదలైన దూత అనే వెబ్ సిరీస్ ఓటీటిలో మంచి విజయాన్ని అందించింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్లో నాగచైతన్య జర్నలిస్ట్ పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేశారు. ఇప్పుడు మళ్లీ అదే జోష్ తో ఒకసారి కొత్త ప్రాజెక్టుని ప్రకటించారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండెల్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ చిత్రం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు గీత ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ బన్నీ వాసు నిర్మిస్తూ ఉన్నారు. కొంతమంది మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా ఇది. గతంలో లవ్ స్టోరీ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీ కి కూడా మంచి మార్కులు పడడంతో స్పెషల్ జోడిగా పేరుపొందింది.

ఇప్పుడు మరొకసారి ఈ జోడి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా పైన క్యూరియాసిటీ పెంచేందుకు ప్రస్తుతం షూటింగ్ కి సంబంధించి పలు అప్డేట్లను చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది. ఇటీవల ఈ సినిమాలో నాగచైతన్య ఫస్ట్ లుక్కుని రిలీజ్ చేస్తారు చిత్ర బృందం. మాస్ లుక్కులో గడ్డం పెంచి కనిపించారు నాగచైతన్య ఈ సినిమా షూటింగ్ ఉడిపిలో మొదలైంది. తాజాగా హీరోయిన్ సాయి పల్లవి ఫస్ట్ లుక్ ని రివిల్ చేశారు ఇందులో సాయి పల్లవి సాధారణ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ సముద్రము తీరాన సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కూడా సాయి పల్లవి కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందంటూ అభిమానులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: