నాని సరిపోదా శనివారం నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాని.  హాయ్ నాన్న సక్సెస్ తో ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నాని. ఇక ఈ స్టార్ హీరో తన ఫోకస్ అంతా ప్రస్తుతం తన తదుపరి సినిమాలపైనే పెట్టాడు. అలా తన తదుపరి సినిమాల్లో సరిపోద శనివారం సినిమా  కూడా ఒకటి. నాని 31వ సినిమాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన

ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. సరిపోద శనివారం సినిమా షూటింగ్ నిన్న హైదరాబాదులో స్టార్ట్ చేశారు. నాని ప్రియాంక మోహన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కి సంబంధించిన పలు సన్నివేశాలను షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. షూటింగ్‌ లొకేషన్‌ లో తీసిన స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2024 ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు

 వార్తలు వస్తుండగా..దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్‌ యాక్టర్‌ ఎస్‌జే సూర్య  కీలక పాత్రలో నటిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని- ప్రియాంకా మోహన్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై క్యూరియాసిటీ అంచనాలు భారీగానే ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: