శోభా శెట్టి అంటే తెలియకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్ మౌనిత అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా శోభ శక్తిశెట్టి కి కార్తీకదీపం సీరియల్ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక అలా ఆ సీరియల్ తో ఎంత ఫేమస్ అయ్యిందో తెలియదు కానీ ఇప్పుడు బిగ్బాస్ షో తో మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈ ఫైర్ బ్రాండ్. అచ్చం కార్తీక్ దీపంలో మౌనిత ఎలా ఉంటుందో అలాగే ప్రవర్తించి కాస్త నెగెటివిటీ కూడా తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఈమె చేసిన గొడవలు గురించి ఎంత చెప్పినా కూడా సరిపోవు. చివరికి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.
కంటెస్టెంట్గా తన సత్తా ఏంటో చూపించి లేడీ పవర్ ఏంటో చూపించింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఇప్పుడు అలా బిగ్ బాస్ నుండి వచ్చిందో లేదో ఇలా అరుదైన గౌరవాన్ని పొందింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా శోభా శెట్టి నీ రాష్ట్రీయ గౌరవ అవార్డు దక్కింది. అవార్డు వచ్చిన సంబరాన్ని శోభ తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన సోషల్ మీడియా వేదికగా దానికి సంబంధించిన పలు ఫోటోలని షేర్ చేసింది. ఇక కార్తీక దీపం సీరియల్ ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ సీరియల్‌లో విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
లేడీ విలన్‌గా శోభా శెట్టికి తిరుగులేని ఇమేజ్ వచ్చింది. అందంలో హీరోయిన్లకు పోటీ ఇవ్వగల శోభ.. నెగెటీవ్ క్యారెక్టర్స్ లో.. హావభావాలతో అదరగొట్టింది. అయితే ఈమె 5 వారాలకే హౌస్ నుండి వెళ్లిపోతుందని అంతా ఎక్స్‌పెక్ట్ చేసారు. కాని గట్టిగా నిలబడి.. అందరి అంచనాలను తారుమారు చేసి. శోభా శెట్టి 14 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగారు. టాప్ 7 కంటెస్టెంట్‌గా నిలిచింది. అయితే బిగ్ బాస్ ఈమెను బయటకు వెళ్ళకుండా కాపాడాడు.. నాగార్జున వల్లే ఈమె ఎలిమినేట్ కావల్సి ఉండగా.. హౌస్ లోకొనసాగింది అని విమర్ష కూడా ఉంది..!!