క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేసిన రామ్ చరణ్..!!

Divya
గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా కాస్త గ్యాప్ ఇవ్వడంతో రామ్ చరణ్ ముంబైలో శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. మొదటిసారి తన కూతురు భార్యతో కలసి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులను మహారాష్ట్ర సీఎం కూడా కలవడం జరిగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కదా కొద్దిరోజులుగా వైరల్ గా మారుతున్నాయి.


రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు పలు రకాల బిజినెస్ రంగాలలో కూడా అడుగుపెట్టారు. ఇప్పటికే ఎయిర్లైన్స్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించిన రామ్ చరణ్ ఏకంగా ఇప్పుడు క్రికెట్ టీమ్ ని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ISPL టోర్నీలో హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించడం జరిగింది.ఈ మేరకు ఆసక్తి కలిగిన ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ కూడా తెలియజేశారు ఈ అద్భుతమైన లీగల్ లో తనతో పాటు పాలుపంచుకునేందుకు చేరండి అంటూ రామ్ చరణ్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేశారు.



రామ్ చరణ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ అభిమానులు ఈ పోస్ట్ ని తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. దీంతో పాటు పలువురు అభిమానులు పది రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అటు సినిమా రంగం నుంచి ఇటు బిజినెస్ రంగం నుంచి రామ్ చరణ్ క్రీడారంగం వైపు అడుగు వేయడంతో పలువురు సెలబ్రిటీలు సైతం రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్  సినిమా వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే మిగులుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: