సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే వీరి కాంబోలో గతంలో అతడు , ఖలేజా అనే మూవీ లు రూపొందాయి. గుంటూరు కారం సినిమా వీరి కాంబో లో మూడవ సినిమా. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... రమ్యకృష్ణ , జయరామ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని చిన బాబు , సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాను మొదటగా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమాని జనవరి 13 వ తేదీన కాకుండా అంతకు ఒక రోజు ముందు అనగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని మరోసారి మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ సంవత్సరం చాలా సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతూ ఉండడంతో వాటి కన్నా ముందే ఈ మూవీ ని సంక్రాంతి బరిలో ఉంచే నేపథ్యంలో ఈ సినిమాని జనవరి 10 వ తేదీన గాని 11 వ తేదీన గాని విడుదల చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన మూడవ మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సింది.