అలాంటి సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టమంటున్న డైరెక్టర్....!!

murali krishna
కొంతమంది సినిమా డైరెక్టర్లు సినిమాలు చేయడం లో వైవిధ్యమైన అంశాలను ఎంచుకొని సక్సెస్ లు కొడుతూ ఉంటారు.ఇక వీళ్ళు చేస్తున్న సినిమాలు చూస్తే సినిమాలు తీయడం లో వీళ్లు మాస్టర్ డిగ్రీ ఏదైనా చేశారా అనే డౌట్ కూడా వస్తుంది.ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు తీస్తే నచ్చుతాయి అనేది తెలుసుకొని ప్రేక్షకుల నాడి పట్టుకొని అలాంటి సినిమాలు తీసి సక్సెస్ లు సాదిస్తు ఉంటారు. కానీ కొన్ని సార్లు వీళ్ళు చేసిన ప్రయోగాలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి.అయితే అలాంటి మేకర్స్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అలాంటి వాళ్లలో ముందు వరుసలో ఉండే డైరెక్టర్ మాత్రం సుకుమార్ అనే చెప్పాలి.ఈయన తీసిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా పొందుతూ ఉంటాయి. ఇలాంటి సుకుమార్ మహేష్ బాబు తో చేసిన వన్ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంది. అలాగే వన్ సినిమా కొంచెం స్క్రీన్ ప్లే ఫాల్ట్ వల్ల సినిమా పెద్దగా ఆడలేదు, కానీ మంచి పొటెన్షియాలిటీ ఉన్న సినిమా ఇది. ఒక స్టార్ హీరో ను అలా కూడా చూపించవచ్చా అనేంత రేంజ్ లో ఒక ఎక్స్పరమెంట్ చేశాడు. అయితే ఈ సినిమా సక్సెస్ అయి ఉంటే బాగుండేది. కానీ అది పెద్దగా ఆడలేదు దాంతో సుకుమార్ ప్రయోగాలు ఏమి చేయకుండా ఆ తర్వాత నుంచి స్ట్రైయిట్ ఫార్వార్డ్ గా స్క్రీన్ ప్లే రాసుకొని ప్రేక్షకులకు అర్థమయ్యే సినిమాలను చేస్తున్నాడు.
ఒకప్పుడు ప్రేక్షకుడు అర్థం చేసుకునే రేంజ్ లో సినిమాలు చేసేవాడు కానీ ఇప్పుడు ప్రేక్షకుడికి అర్థమైతే చాలు అనే ఉద్దేశ్యం లోనే సినిమాలను చేస్తున్నాడు.ఆయనకి కనక ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఒక మంచి సినిమా చేయమని చెప్తే ప్రేక్షకుడి ఐక్యూ లెవల్ ని టెస్ట్ చేస్తూ ఒక సూపర్ హిట్ సినిమా చేసే సత్తా ఆయన దగ్గర ఉంది. కానీ స్టార్ హీరోకి ఉన్న కొన్ని లిమిటేషన్స్ అలాగే ప్రొడ్యూసర్స్ కి ఉండే భయాలు, ప్రేక్షకుడి అర్థం చేసుకోలేని తనం తో ప్రేక్షకుడుకి నచ్చే సినిమాలు చేస్తే చాలు అని తను కూడా అవే సినిమాలు చేస్తున్నాడు… ప్రేక్షకుడు ఒక టైప్ ఆఫ్ స్టోరీలకు ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఆ స్టీరియోని బ్రేక్ చేసి ఒక కొత్త సినిమాని ప్రేక్షకులు ఎక్కించాలి అంటే కొంచం టైమ్ అవుతుందని తెలుసుకున్న సుకుమార్ ఇంటెలిజెంట్ సినిమాలు కాకుండా రెగ్యులర్ ఫార్మాట్లో సినిమాలు చేశాడు. అందులో భాగంగా వచ్చిన సినిమాలే రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలు…ఇవి మాస్ ఆడియన్స్ తో పాటు ప్రతి ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకొని సక్సెస్ సాధించాయి.
కానీ ఆయనకి ఇలాంటి సినిమాలు చేయడం కంటే ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడం అంటేనే చాలా ఇష్టం అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వన్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నా సినిమాలను అర్థం చేసుకునే అంత తెలివి ప్రేక్షకులకు లేదు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా సుకుమార్ లాంటి మేకర్ చేసే సినిమాలు అర్థం చేసుకునే నాలెడ్జ్ ప్రేక్షకుల దగ్గర లేదు అనేది మాత్రం వాస్తవం. ఒక మూస ధోరణిలో సినిమాలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకుడిని మెల్లిగా డిఫరెంట్ అటెంప్ట్ సినిమాలకు అలవాటు చేయాలంటే కష్టమవుతుంది. ఆ కాలుక్యులేశన్స్ ఏమీ లేకుండా వన్ సినిమా చేశాడు. ఇక దాని ఫలితం ఎలా ఉన్నా కూడా ఆయన ఒక డిఫరెంట్ డైరెక్టర్ అనే పేరు అయితే సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: