'జవాన్' మూవీ ని బీట్ చేసిన యానిమల్ మూవీ !

Anilkumar
 సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన 'యానిమల్' మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ మూవీకి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. దీంతో నార్త్ లో ఈ సినిమా దుమ్ము లేపుతోంది. సౌత్ లోనూ అదే హవా కనిపిస్తోంది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.116 కోట్ల గ్రాస్ వసూళ్ళు రాబట్టి రణబీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు బాలీవుడ్ లో నాన్ హాలిడే హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 

ఇక రెండో రోజు వచ్చిన కలెక్షన్స్ తో బాలీవుడ్లో ఇదివరకు ఉన్న రికార్డ్స్ అన్ని చల్లాచెదురు అయిపోయాయి. తాజాగా షారుక్ 'జవాన్' రికార్డ్ ని 'యానిమల్' బ్రేక్ చేసింది. అది కూడా రిలీజ్ అయిన రెండో రోజే కావడం విశేషం. ఇప్పటివరకు బాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా అన్ని రికార్డులు జవాన్ ఖాతాలోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు యానిమల్ జవాన్ ని బీట్ చేసింది. జవాన్ మూవీకి రెండవ రోజు కేవలం హిందీలోనే రూ.128.23 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. తాజాగా ఆ కలెక్షన్స్ ని బీట్ చేస్తూ 'యానిమల్' రెండో రోజు హిందీలో రూ.131.07 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.

 అతి తక్కువ సమయంలోనే ఈ మూవీ షారుక్ జవాన్ పేరిట ఉన్న రికార్డ్ ని బీట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ.236 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని సాధించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. మొదటి రోజే తెలుగులో రూ.15 కోట్ల షేర్ సాధించింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కాగా యానిమల్ సినిమాలో రణ్ బీర్ యాక్టింగ్ పై ప్రశంసలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: