అతను ఎలిమినేట్ కావాల్సింది.. కానీ గౌతమ్ బయటికొచ్చాడంటున్న నాగార్జున?
అయితే ఇలా సోషల్ మీడియా జనాలు ఊహించినట్లుగానే ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేషన్ కూడా జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి వెళ్లిపోతాడు అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక గౌతమ్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎప్పటిలాగానే నాగర్జున హౌస్ లో ఎవరికి రెండు ఫేసులు ఉన్నాయి అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. అయితే అందరి విషయంలో తనదైన సమాధానం చెప్పాడు గౌతమ్.
ఇలాంటి సమయంలో నాగార్జున చెప్పిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. వాస్తవానికి ఈ వారం అంబటి అర్జున్ ఎలిమినేట్ కావాల్సింది. కానీ గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు అంటూ నాగార్జున చెప్పాడు. ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అర్జున్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడని లేదంటే అతనే ఎలిమినేట్ అయ్యేవాడు అంటూ నాగార్జున చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అందుకే మిగిలిన రెండు వారాలు కంటెస్టెంట్స్ ఎంతో జాగ్రత్తగా ఆడాలి అంటూ నాగార్జున సూచించాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.