స్పిరిట్ ఎప్పుడు వస్తుందో చెప్పిన సందీప్ రెడ్డి వంగా!

Anilkumar
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ అందించారు. 'యానిమల్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ 'స్పిరిట్' మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.' స్పిరిట్ మూవీని 2025 క్రిస్మస్ లేదా 2026 సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా 2024 సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. దీనికంటే ముందు ఓ సందర్భంలో స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అన్నాడు. యానిమల్ రిలీజ్ అయిన వెంటనే స్పిరిట్

 కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తానని, వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించాడు. ఈ అప్డేట్స్ తో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇన్నాళ్లు ఎటువంటి అప్డేట్ ఇవ్వని సందీప్ తాజాగా స్పిరిట్ మూవీ కి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమల్ ట్రైలర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ మూవీపై ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. యానిమల్ లో రణబీర్ ని మోస్ట్ వైలెంట్ గా చూపించిన సందీప్ రెడ్డి వంగా తమ అభిమాన హీరో ప్రభాస్ ని 

ఇంకెలా ఎలివేట్ చేస్తాడో చూడాలని ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక 'యానిమల్' విషయానికొస్తే, ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ తో సాగే రివెంజ్ యాక్షన్ డ్రామా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రణబీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్ర పోషిస్తున్నారు. బాబి డియోల్ విలన్ గా కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: