‘ఎల్లమ్మ’లో దేవి తండ్రిగా ఆ సెన్సేషనల్ స్టార్ సీనియర్ హీరో..సినిమా సగం హిట్ అయిపోయిన్నటే పో..!?
‘ఎల్లమ్మ’ ఒక గ్రామీణ నేపథ్య ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ‘బలగం’లో గ్రామీణ జీవనాన్ని ఎంతో సహజంగా చూపించిన వేణు యెల్డండి, ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో ఎమోషన్, కథనం, పాత్రల డెప్త్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించడం ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిదే అయినా, ఆయనకు సంగీతంపై ఉన్న పట్టు, కథను అర్థం చేసుకునే విధానం ఈ పాత్రకు ప్లస్ అవుతాయని టీమ్ భావిస్తోంది.ఈ సినిమాకు మరో పెద్ద హైలైట్ ఏమిటంటే… సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్‌నే అందించడం. నటుడిగా తెరపై కనిపిస్తూ, సంగీత దర్శకుడిగా ఆ సినిమాకే ప్రాణం పోయడం అనేది చాలా అరుదైన విషయం. గ్రామీణ నేపథ్య కథలకు దేవి సంగీతం ఎంత బలంగా నిలుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ కథను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
ఇక హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారన్న విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు. గ్రామీణ కథకు తగ్గట్టుగా సహజమైన నటన ఉన్న హీరోయిన్ను ఎంపిక చేసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.నిర్మాణ పరంగా కూడా ఈ చిత్రానికి మంచి బలం ఉంది. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ బ్యానర్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ చూస్తే, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అలాగే, ఈ మూవీ ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టి-సిరీస్ సొంతం చేసుకోవడం మరో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
మొత్తానికి, సెన్సేషనల్ కాంబినేషన్స్, ఆసక్తికరమైన క్యాస్టింగ్, గ్రామీణ కథతో కూడిన బలమైన ఎమోషన్… ఇవన్నీ కలిసొస్తే ‘ఎల్లమ్మ’ మరో ‘బలగం’ స్థాయి విజయాన్ని అందుకుంటుందా అనే ఉత్కంఠ ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది. మరి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంతవరకు మెప్పిస్తాడో, రాజశేఖర్ పాత్ర ఎంత బలంగా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొంచెం వేచిచూడాల్సిందే.