విశ్వంభర : బడ్జెట్ విషయంలో హద్దులు దాటేసిందా..?
దీంతో ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. చిత్ర బృందం కూడా గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో మాత్రం వెనకడుగు వేయకుండా మళ్లీ విఎఫ్ఎక్స్ షాట్స్ మొత్తం రివర్క్ చేసినట్లుగా వినిపిస్తున్నాయి. దీనివల్ల నిర్మాతలకు బడ్జెట్ కూడా మరింత ఎక్కువైందనే విధంగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే సినిమా ఆలస్యం అవుతూ ఉండడంతో వడ్డీలు కూడా పెరిగిపోయాయి. దీంతో బడ్జెట్ నిర్మాతలు ఊహించని విధంగా పెరిగిపోయింది.
దాదాపుగా రూ .250 కోట్లకు పైగా ఈ సినిమా బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి కేవలం ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే రూ .130 కోట్ల రూపాయల వరకు ఖర్చయిందట. చిరంజీవి రెమ్యూనరేషన్ ఈ సినిమాకి రూ .75 కోట్ల రూపాయలు కాక ఇతర క్యాస్టింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇలా అన్ని కలుపుకొని రూ .250 కోట్ల వరకు ఖర్చయిందని వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుతం అంత మార్కెట్ అయితే కనిపించడం లేదు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూ.150 కోట్ల రూపాయల షేర్ ను మాత్రమే రాబట్టింది. మరి విశ్వంభర చిత్రానికి రూ.250 కోట్ల రూపాయల షేర్ థియేటర్స్ అంటే కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు.